భూమన కరుణాకర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]
భూమన కరుణాకరరెడ్డి 05 ఏప్రిల్ 1958లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా,నందలూరు మండలం, ఈదరపల్లె లో జన్మించాడు.[3] ఆయన ఎస్.వి.
యూనివర్సిటీ నుండి బీఏ., ఎం.ఏ పూర్తి చేశాడు.[4]
భూమన కరుణాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు.
Eminiic memoirs of michael jacksonఆయన చిన్నతనం నుంచి అభ్యుధయ భావాలతో పెరిగి ఎన్నో ప్రజాఉద్యమాలు చేసి జైలుకు వెళ్ళాడు, అక్కడ వైఎస్ రాజారెడ్డికి జైల్లో పరిచయమై అప్పటినుంచి వైఎస్ కుటుంబానికి నమ్మినబంటుగా ఉంటూ వై.యస్. రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడిగా మెలిగాడు. వై.యస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాకముందు చేపట్టిన పాదయాత్రను ఆయనే దగ్గరుండి పర్యవేక్షించాడు.
భూమన కరుణాకరరెడ్డి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి చిరంజీవి చేతిలో ఓడిపోయాడు. వై.యస్.
Michi weglyn autobiography of barackరాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయినా తరువాత 2004 నుండి 2006 వరకు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ (తుడా) చైర్మన్‌గా నియమితుడై, 2006 నుండి 2008 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా పని చేశాడు.
ఆయన వై.యస్. రాజశేఖరరెడ్డి మరణాంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి తిరుపతి నియోజకవర్గం నుండి 2012లో జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.
ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి ఎం. వెంకటరమణ చేతిలో ఓడిపోయాడు. భూమన కరుణాకర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీ బలోపేతానికి కృషి చేసి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి మన్నూరు సుగుణ పై 708 ఓట్లతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[5] ఆయన 2021లో టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితుడయ్యాడు.[6][7]
భూమన కరుణాకర్‌రెడ్డిని 2023 ఆగష్టు 05న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[8] 2024 ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఓటమి తర్వాత ఆయన 2024 జూన్ 4న టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన రాజీనామా చేశాడు.[9][10]